Header Banner

40 గంటలుగా ఎయిర్‌పోర్టులోనే.. ఒకటే టాయిలెట్‌! చివరికి ఏం జరిగిందంటే!

  Fri Apr 04, 2025 11:02        World

లండన్ నుంచి ముంబైకి బయలుదేరిన విమానం సాంకేతిక లోపం కారణంగా తుర్కియేలో దిగింది. దియార్ బాకిర్ విమానాశ్రయంలో దిగి గంటలు గడుస్తున్నా ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేయలేదని, దాదాపు 40 గంటలుగా విమానాశ్రయంలోనే పడిగాపులు కాస్తున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. విమానాశ్రయంలో కనీస వసతులు కూడా లేవని, 250 మందికి ఒకే ఒక్క టాయిలెట్ ఉందని చెప్పారు. చలిని తట్టుకోవడానికి కనీసం దుప్పట్లు కూడా ఇవ్వలేదని మండిపడుతున్నారు. వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమాన ప్రయాణికులకు ఎదురైందీ అనుభవం.

 

ఇది కూడా చదవండి: ఏపీకి మరో భారీ పెట్టుబడి వచ్చింది.. రూ.5వేల కోట్లతో - ఆ జిల్లాకు మహర్దశ! ప్రత్యక్షంగా, పరోక్షంగా 7,500 మందికి..

 

ఈ విషయం తెలుసుకున్న ప్రయాణికుల కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. విమర్శలు వెల్లువెత్తుతుండడంతో వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్ లైన్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. లండన్ నుంచి ముంబైకి బయలుదేరిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతోనే అత్యవసరంగా తుర్కియేలో దించాల్సి వచ్చిందని పేర్కొంది. ప్రయాణికులు, తమ సిబ్బంది భద్రతే తమకు ముఖ్యమని చెప్పింది. విమానాన్ని నిపుణులు పరిశీలిస్తున్నారని, మరమ్మతులు పూర్తయ్యాక శుక్రవారం మధ్యాహ్నం విమానం తిరిగి బయలుదేరుతుందని తెలిపింది. ప్రయాణికులకు రాత్రిపూట హోటల్ లో బస, భోజన వసతి ఏర్పాటు చేసినట్లు వివరించింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది. తమ ప్రయాణికులను ముంబై చేర్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలిపింది.

 

ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్టును ప్రకటించిన ముఖ్యమంత్రి! చైర్మన్‌గా ఆయన నియామకం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే.! వారికి గుడ్ న్యూస్..

 

వైసీపీ ఎంపీ అరెస్ట్.. ప్యాలెస్ షేక్! లిక్కర్ స్కాంలో హైకోర్టు కీలక నిర్ణయం..!

 

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా! ఎవ్వరూ ఆపలేరు..

 

రుషికొండ ప్యాలెస్‍పై మంత్రులతో సీఎం చర్చ! కీలక ఆదేశాలు.. సుమారు 400-500 కోట్ల రూపాయలుగా..

 

ఏపీ ప్రభుత్వానికి మరో శుభవార్త.. అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులు.! రాజధాని నిర్మాణంలో దూసుకుపోవడమే..

 

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - 100 శాతం ప్రక్షాళన.. టీటీడీ సమీక్షలో సీఎం కీలక ఆదేశాలు!

 

ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త.. మరో బైపాస్కు గ్రీన్ సిగ్నల్! ఆ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా.. ఇక స్థలాలకు రెక్కలు?

 

సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.? ఈ కేసులో కీలక పరిణామం..!

 

పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్, పార్టీలో పదవులు స్పష్టం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #VirginAtlanticFlight #DelayTurkey #DiyarbakirAirport #LondontoMumbai #TechnicalIssues #PassengerStranded #AirTravelProblems #AirlineComplaint